ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : ఎన్నికల కోడ్ నిబంధన ఉల్లంఘించిన బీఆర్ఎస్ అభ్యర్థి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్ ఆఫీసర్ కు డివైఎఫ్ఐ నాయకులు ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల నిబంధనలను కోడ్ ను ఉల్లంఘించి కారు గుర్తుకు ఓటు వేయాలని విద్యాసంస్థ ఆవరణలో ప్రచారం చేసిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కొంటు సాగర్ నాయకులు మొగిలిచర్ల సురేష్, అట్ల శివకుమార్ రిటర్నింగ్ ఆఫీసర్ అరుణశ్రీ కి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కొంటూ సాగర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎలక్షన్ కమిషన్, విద్యా హక్కు చట్ట ప్రకారం ఏ రాజకీయ పార్టీ నాయకులు గాని వారికి సంబంధించిన ప్రచారం కాని విద్యాసంస్థ ఆవరణలో నిర్వహించకూడదని నిబంధనలు ఉన్న వాటిని ఉల్లంఘించి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొరుకంటి చందర్ వారి యొక్క గుర్తు కారుకే ఓటు వేయాలని సింగరేణి మెడికల్ కళాశాల రామగుండం ఆవరణలో ప్రచారం చేయించడం నిబంధనలు ఉల్లంఘనే అని అన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రచారం నిర్వహించుకుంటున్నారని ఎవరు కూడా ప్రభుత్వ విద్యా సంస్థలను వారి యొక్క స్వప్రయోజనాల కోసం ఎన్నికల ప్రచారంలో భాగంగా వాడుకుంటలేరని దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదే విధంగా నాలుగున్నర ఏళ్ల పాటు నిజంగా రామగుండంలో అభివృద్ధి జరిగితే ఆ అభివృద్ధి మళ్లీ అధికారంలో కూర్చోబెడుతుందని దానికి ఇంతలా ప్రచారం చేసుకుంటూ దిగజారాల్సిన అవసరం లేదని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రత్యక్షంగా సీఎం కేసీఆర్ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మెడికల్ కళాశాల ఏర్పాటు జరిగితే ఈ ప్రాంతం అభివృద్ధి జరిగే అవకాశాలు ఉన్నాయని ఆలోచించి వారి కృషితో సింగరేణి సంస్థ నిధుల యొక్క సహకారంతో రామగుండం ప్రాంతంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేసుకోవడం జరిగిందని వారు గుర్తు చేశారు. ఈ సంఘటన పైన మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ హిమబిందు అందుబాటులో లేక పోవటంతో వైస్ ప్రిన్సిపల్ నరేందర్ ను వివరణ కోరితే ఉదయం 9 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఏం జరిగినా మా బాధ్యత ఉంటుందని నాలుగు గంటల తర్వాత కళాశాల ఆవరణలో ఏం జరిగినా తనకు సంబంధం లేదని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం జరిగిందన్నారు. కాబట్టి మెడికల్ కళాశాల సిబ్బంది పైన కూడా చట్టపర చర్యలు తీసుకోవాలని వారి సందర్భంగా రిటర్నింగ్ అధికారిని కోరడం జరిగిందన్నారు. కాబట్టి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగాలన్న పారిశ్రామిక ప్రాంతం అభివృద్ధి జరగాలన్న అవకాశం వచ్చింది కాబట్టి ఆలోచించి అవగాహనతో ప్రజలు యువత సరైన నాయకున్ని ఎన్నుకోవాలని వారి సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
Admin
Aakanksha News