ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా ఆధ్వర్యంలో ఫిబ్రవరి 22న జరిగే సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా ఆవిర్భావ దినోత్సవాలను జయప్రదం చేయాలని పోరాటాల పురిటిగడ్డ అయిన పెద్దంపేట గ్రామంలో కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ ప్రజాప్రంథా జిల్లా కన్వీనర్ గుజ్జుల సత్యనారాయణ రెడ్డి హాజరై మాట్లాడుతూ వందేళ్ళ కమ్యూనిస్టు విప్లవోద్యమాన్ని సొంతం చేసుకుని ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని అన్నారు.సమాజంలో వచ్చిన మార్పులను శాస్త్రీయంగా పరిశీలించి దోపిడీ రూపాలు సమాజంలోని అన్ని రూపాలను చుట్టేస్తున్న స్థితిని అర్థం చేసుకోవాలని సూచించారు. ఈ స్థితిలో సిపిఎంఎల్ ప్రజాపంథా వ్యవసాయ రంగంలో పెట్టుబడిదారీ విధానం అమలవుతుందని, మార్కెట్ కోసమే ఉత్పత్తి జరుగుతుందని ప్రజాపందా చెప్పిందని వందేళ్ల కమ్యూనిస్టు ఉద్యమ విలువైన త్యాగ పూరిత పోరాట వారసత్వాన్ని స్వీకరిద్దామని పేర్కొన్నారు. ఆ కృషి కొనసాగింపుగా ప్రజాపంథాలో విప్లవోద్యమ నిర్మాణం చేద్దామని. ఈ క్రమంలో ఫిబ్రవరి 22న ప్రజా పంథా ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.ఇటీవల కాలంలో ఈనెల 8వ తేదీన సిపిఐ ఎంఎల్ ప్రజాబందా ప్లీనరీ లో జరిగిన పంథాను అధ్యయనం చేసి PDSU రాష్ట్ర మాజీ అధ్యక్షుడుగా ఉన్న జూపాక శ్రీనివాస్,AIKMS జిల్లా అధ్యక్షుడిగా ఉన్న గుమ్మడి వెంకన్న, IFTU రాష్ట్ర నాయకుల తోకల రమేష్ లు సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీకి రాజీనామా చేసి హైదరాబాద్ లో సిపిఐ ఎంఎల్ ప్రజా పంథాలో చేరడం జరిగిందన్నారు. ఇట్టి విషయాలను పత్రిక ముఖంగా కూడా అనేక సార్లు ప్రకటించామని తెలిపారు. తెగతెంపులు చేసుకుంటున్నట్టు న్యూడెమోక్రసీకి సంబంధం లేదని గోదావరిఖనిలో విలేకరుల సమావేశంలో కూడా న్యూ డెమోక్రసీ నేతలు ప్రకటించారు. కానీ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నేతలు పదేపదే సంబంధం లేదంటూ ప్రజలను గందరగోళపరిచే ప్రకటనలు చేస్తున్నారని. మా అంతట మేమే తెగతెంపులు చేసుకొని వచ్చామని పేర్కొన్నారు. న్యూడెమోక్రసీ విధానాలు నచ్చక ప్రజా పంథాలో కొనసాగుతున్నామని మాకు న్యూడెమోక్రసీ పార్టీకి సంబంధం లేదని మేం బాహాటంగానే ప్రకటించామన్నారు.మా ప్రకటనలు వినని చూడని న్యూడెమోక్రసీ నేతలు పదేపదే తప్పుడు దుష్ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. దీన్ని ప్రజలంతా గమనించాలని విప్లవ వారసత్వాన్ని కొనసాగించే నాయకత్వాన్ని గమనించాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో CPI ML ప్రజా పంధా నాయకులు జూపాక శ్రీనివాస్, తోకల రమేష్, గుమ్మడి వెంకన్న, పెండ్యాల రమేష్, ఆడెపు శంకర్, మార్త రాములు, గొల్లపల్లి చంద్రయ్య, భూషవేణి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News