Wednesday, 29 July 2026 09:54:22 AM

చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్‌గా బండి సంజయ్

Date : 20 October 2023 03:41 PM Views : 376

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్‌గా బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్‌ను బీజేపీ అధిష్టానం ఎంపిక చేసింది. చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్ ప్రచారం చేయనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, నడ్డా, అమిత్ షా సహా 40 మందితో స్టార్ క్యాంపెయినర్ జాబితాను బీజేపీ విడుదల చేసింది.జేపీ నడ్డా నివాసంలో బీజేపీ తెలంగాణ కోర్ గ్రూప్ నేతల సమావేశం ముగిసింది. సమావేశంలో తరుణ్ ఛుగ్, ప్రకాష్ జవదేకర్, కిషన్ రెడ్డి, డీకే అరుణ, డా. కే. లక్ష్మణ్, బండి సంజయ్, ఈటెల పాల్గొన్నారు. తెలంగాణ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేశారు. నడ్డాతో భేటీకి ముందు జవడేకర్ నివాసంలో మధ్యాహ్నం నుంచి సుదీర్ఘ మంతనాలు జరిపారు.తెలంగాణ నుంచి కేవలం బండి సంజయ్‌ను మాత్రమే ఛత్తీస్ గఢ్ ఎన్నికల ప్రకాచారంలో బీజేపీ ఉపయోగించుకుంటోంది. నడ్డాతో గంట తర్వాత మరోసారి తెలంగాణ బీజేపీ కోర్ కమిటీ సమావేశం కానుంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :