Tuesday, 28 July 2026 11:53:34 AM

ప్రజా అంకిత యాత్రకు భారీగా తరలివచ్చిన 46వ డివిజన్ ప్రజలు...

Date : 28 October 2023 07:12 PM Views : 863

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : రామగుండం ఎమ్మెల్యే కోరు కంటి చందర్ నిర్వహించిన ప్రజా అంకిత యాత్రకు 46వ డివిజన్ అధ్యక్షుడు మెరుగు చంద్రమౌళి ఆధ్వర్యంలో ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. రామగుండం నియోజకవర్గంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అన్ని వర్గాల ప్రజల మొన్ననాలను పొందుతూన్న ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని డివిజన్ ప్రజలకు మెరుగు చంద్రమౌళి పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. డివిజన్ నుండి సుమారుగా 500 మందితో ప్రజా అంకిత యాత్ర కొనసాగింది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :