ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : అసత్య ప్రచారాలపై ఆశావాహులు ఆదివారం జరిగే సమావేశాన్ని వాయిదా వేసినట్లు రామగుండం బీఆర్ఎస్ ఆశావాహులు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆశావాహులపై తప్పుడు ప్రచారం చేయడంపై వారు స్పందించారు.నియోజకవర్గ ఇంచార్జీ మంత్రి కొప్పుల ఈశ్వర్ నేతృత్వంలో ఆత్మీయ సమావేశం నిర్వహించాల్సి ఉంది. అయితే స్థానిక ఎమ్మెల్యే తన అనుచరుల ద్వారా ఆశావాహులను కించపరిచే విధంగా పోస్టులు పెట్టడంతో పాటు అమ్ముడు పోయారని సోషల్ మీడియాలో ప్రచారం చేశారని వారు పేర్కొన్నారు. ఇదే విషయాన్ని మంత్రి దృష్టికి కూడా తీసుకువెళ్లినట్లు తెలిపారు.
Admin
Aakanksha News