Tuesday, 28 July 2026 06:42:21 AM

హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి కేటీఆర్‌...

ఫార్ములా ఈ రేస్‌ వ్యవహారంలో ఏసీబీ కేసుపై క్వాష్‌ పిటిషన్‌...

Date : 20 December 2024 01:57 PM Views : 547

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుపై బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఫార్ములా-ఈ రేస్‌ వ్యవహారంలో ఏసీబీ కేసుపై క్వాష్‌ పిటిషన్‌ వేశారు.ఈ మేరకు కేటీఆర్‌ తరఫు లాయర్లు జస్టిస్‌ శ్రవణ్‌ కుమార్‌ బెంచ్‌ ముందు లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. భోజన విరామం తర్వాత పిటిషన్‌ను విచారించాలని కోరారు. ఈ నేపథ్యంలో కేటీఆర్‌ పిటిషన్‌పై హైకోర్టు నేడు విచారించనుంది. కాగా, లంచ్‌ మోషన్‌ను సింగిల్‌ బెంచ్‌ తిరస్కరించడంతో సీజే బెంచ్‌ ముందు పిటిషన్‌ను దాఖలు చేశారు.ఈ మేరకు ఏ1గా మాజీ మంత్రి కేటీఆర్‌, ఏ2గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అర్వింద్‌కుమార్‌, ఏ3గా హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి, ఇతరులపై కేసు నమోదు చేశారు. ఐసీపీ (బీఎన్‌ఎస్‌) 13(1)(ఏ), 13(2), సీపీయాక్ట్‌ 409, 120 (బీ) సెక్షన్స్‌ కింద అభియోగాలు మోపారు.ఈ-కార్‌ రేసింగ్‌లో రూ.54.88 కోట్లు దుర్వినియోగం చేశారనే అభియోగంతో కేటీఆర్‌పై ఎంఏయూడీ సెక్రటరీ దానకిశోర్‌ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి ఫిర్యాదు చేశారు. దీంతో కేటీఆర్‌పై ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :