Tuesday, 28 July 2026 08:09:35 AM

మోడీని వ్యతిరేకించింది.. బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే

బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇంచార్జీ ఏరోళ్ల శ్రీనివాస్

Date : 19 March 2023 05:08 PM Views : 643

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : దేశంలో మోడీని వ్యతిరేకించి నిలదీసి మాట్లాడింది బీఆర్ఎస్ పార్టీ ఒకటే అని ఆయన అన్నారు.ఈ మేరకు ఆదివారం రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ...ఈడీ, సీబీఐ పేరుతో నోటీసులు ఇస్తూ ఎమ్మెల్సీ కవితను బెదిరింపులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ఈడీ, సీబీఐలు కేంద్రానికి జీవ సంస్థలుగా మారాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బిజెపి పార్టీని నిలదీస్తే సమాధానాలు కూడా చెప్పలేదని అన్నారు. భారతదేశంలోనే ఒక మోడల్ గా ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు నిలుస్తున్నాయని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 2వేల రూపాయల పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమని పేర్కొన్నారు. అయితే నోటీసులపేరుతో వేధిస్తూ జైల్లో పెట్టడానికి బిజెపి కుట్ర చేస్తుందని విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా కూని చేస్తుందని ఘాటుగా స్పందించారు. మోడీ పాలనలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలను మోడీ తన సొంత నియోజకవర్గాల్లో కాపీ కొట్టి చేస్తున్నారని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తో పాటు టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :