Tuesday, 28 July 2026 04:46:36 AM

ప్రజాప్రతినిధులా? రియల్ ఎస్టేట్ ఏజెంట్లా?

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు

Date : 01 April 2025 04:57 PM Views : 726

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : హెచ్ సియూ ఉద్రిక్తత పరిణామాలపై కేటీఆర్ స్పందించారు. అభివృద్ధి, ప్రభుత్వ భూమి అని సమర్థించుకుంటున్నారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. పర్యావరణ పరిరక్షణ పేరిట పేదల ఇళ్లు కూల్చారని మండి పడ్డారు. అభివృద్ధి పేరుతో గిరిజన తండాలపైకి వెళ్లారని, జంతువుల ప్రాంతాలకు వెళ్లి సామూహిక హత్య చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. ప్రభుత్వమా? బుల్డోజర్ కంపెనీయా?అని కెటిఆర్ ప్రశ్నించారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులా? రియల్ ఎస్టేట్ ఏజెంట్లా? అని ధ్వజమెత్తారు. విధ్వంసం, ఖజానా నింపుకోవడమే కాంగ్రెస్ నాయకుల నినాదమా అని కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :