Tuesday, 28 July 2026 04:54:42 AM

కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

Date : 27 October 2022 01:25 PM Views : 453

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గాంధీ చౌరస్తాలో రామగుండం నగరపాలక సంస్థ మేయర్ బంగి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను గురువారం టిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి దగ్ధం చేశారు. సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. బిజెపి పెద్దలు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ఆయన ఖండించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రారంభిస్తూ ప్రజలకు పాలనను అందిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదన్నారు. ఇప్పటికైనా బిజెపి తన పద్ధతిని మార్చుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు కృష్ణవేణి, బాల రాజ్ కుమార్, కవితసరోజిని, జేవీ రాజు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాతిపెల్లి ఎల్లయ్య, తానిపర్తి గోపాలరావు, అనుముల కళావతి, మొగిలి తదితరులు పాల్గొన్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :