Tuesday, 28 July 2026 07:57:00 AM

హరీష్ రావు, బీఆర్ఎస్ సోషల్ మీడియా, సంతోష్ రావు సీక్రెట్ మీడియా నాపైన దాడి చేస్తున్నాయి...

రేవంత్ రెడ్డి నిజమైన పాలమూరు పులినా? లేక పేపర్ పులినా...? ఆల్మట్టి వివాదంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఘాటైన వ్యాఖ్యలు...

Date : 20 September 2025 02:52 PM Views : 507

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : నాపై హరీష్ రావు మీడియా, బీఆర్ఎస్ సోషల్ మీడియా, సంతోష్ రావు ‘సీక్రెట్ మీడియా’ నాపైన దాడి చేస్తున్నాయని బీఆర్ఎస్‌లో నాకు ఎదురైన ఇబ్బందులు రాష్ట్ర ప్రజలకు తెలుసాని బీఆర్ఎస్ నుంచి వచ్చిన పదవి వద్దని స్పీకర్ ఫార్మాట్‌లోనే రాజీనామా చేశాను. మళ్లీ రాజీనామా ఇవ్వమంటే ఇస్తాను అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ మేరకు శనివారం జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడుతూ.. కృష్ణానది జలాల సమస్య, ఆల్మట్టి ఎత్తు పెంపు వివాదం, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, బీసీల హక్కులపైన తాను కలిగిన అభిప్రాయాలను విపులంగా వెల్లడించారు.కృష్ణానది తెలంగాణకు ప్రాణదాయినిగా ఉందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా వాటా కోసం కష్టపడి పోరాడామని కవిత గుర్తు చేశారు.ఉమ్మడి ఏపీలో కేసు వేస్తేనే స్టే వచ్చేది. కానీ ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఐదు మీటర్ల ఎత్తు పెంచి 100 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవాలని నిర్ణయించింది. అదే జరిగితే కృష్ణానదిలో తెలంగాణ ప్రజలకు నీళ్లు అందక, కేవలం క్రికెట్ ఆడుకునే పరిస్థితి మిగులుతుందని వ్యాఖ్యానించారు.కర్ణాటక నిర్ణయంపై మహారాష్ట్ర అభ్యంతరం తెలిపి, తమ రాష్ట్రంలోని రెండు జిల్లాలు మునిగిపోతాయని అక్కడి సీఎం స్పష్టంగా చెప్పారు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం మౌనం వహించడం ఆందోళన కలిగిస్తోందని విమర్శించారు.తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే సీఎం ఎందుకు స్పందించడం లేదు? తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలు గమనించాలని అన్నారు.రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన కవిత, “పాలమూరు పులిబిడ్డ రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు, కృష్ణానది ప్రాజెక్టులకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. అవసరం లేని విషయాలకు సుప్రీంకోర్టుకు వెళ్లే సీఎం, ఆల్మట్టి విషయంలో మాత్రం నోరుమూసి ఎందుకు కూర్చున్నారు? రేవంత్ నిజమైన పాలమూరు పులినా? లేక పేపర్ పులినా? అనేది ఈ సమస్యతో తేలిపోతుందని మండిపడ్డారు.అలాగే హైదరాబాద్‌లో జరగబోయే కృష్ణానది బోర్డు సమావేశంలో తప్పని సరిగా సీఎం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరవ్వాలని, అక్కడ అల్మట్టికి వ్యతిరేకంగా తెలంగాణ తరఫున బలమైన వాదనలు వినిపించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టుకు వెళ్లకపోతే జాగృతి తరఫున మేమే వెళ్తాం. బనకచర్లపై వెళ్లినట్లుగానే ఆల్మట్టిపైనా పోరాటం చేస్తాం అని స్పష్టం చేశారు.ఏపీ మాజీ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్‌ను తెలంగాణ ఇరిగేషన్ సలహాదారుగా నియమించడం తప్పు అని కవిత ఆరోపించారు. “ఆ అధికారి మన రాష్ట్రానికి ఎందుకు మక్కువ చూపుతాడు? ఆయన్ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం” అని అన్నారు.బీసీల సమస్యపై కూడా కవిత అసంతృప్తి వ్యక్తం చేశారు. “ముఖ్యమంత్రి బీసీల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్క సమీక్ష కూడా జరపలేదు. రిజర్వేషన్ల విషయాన్ని పట్టించుకోకపోతే జాగృతి ఆధ్వర్యంలో మంత్రుల ఇళ్లు, సీఎం ఇల్లు ముట్టడిస్తాం” అని హెచ్చరించారు.గత సంవత్సరం రాజకీయ కారణాలతో బతుకమ్మ జరపలేకపోయాం. ఇప్పుడు జాగృతి ఆధ్వర్యంలో వేడుకల్లో పాల్గొంటున్నాను. స్వంత ఊరు చింతమడక నుంచి ఆహ్వానం రావడంతో అక్కడి బతుకమ్మ వేడుకలకు వెళ్తున్నాను. దీన్ని రాజకీయ కోణంలో చూస్తారని నాకు తెలుసు” అని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ కాలంలో దసరాకు బతుకమ్మ పేరుతో చీరలు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి రెండు చీరలు ఇస్తానని చెప్పినా, వాటికి బతుకమ్మ పేరు కాకుండా ఇందిరమ్మ పేరు పెడతానని అంటున్నారు. బతుకమ్మ పేరునే కొనసాగించాలి. లేకపోతే తెలంగాణ ఆడబిడ్డ పేరు పెట్టాలి. తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను దూరం చేసే ప్రయత్నం చేయకూడదని వ్యాఖ్యానించారు.కవిత తన ప్రసంగంలో చివరగా తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడుకోవడమే ప్రధాన లక్ష్యమని, జాగృతి తరఫున ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :