Tuesday, 28 July 2026 01:28:21 PM

అల్లు అర్జున్‌కు 14 రోజుల రిమాండ్‌ విధించిన నాంపల్లి కోర్టు....

Date : 13 December 2024 04:54 PM Views : 851

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : పుష్ప-2 రిలీజ్ సంధ్య థియేటర్‌ లో జరిగిన తొక్కిసలాట కేసులో ఏ-11గా ఉన్న సినీనటుడు అల్లు అర్జున్‌ ను ఉదయం చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో విచారణ జరిపిన కోర్టు న్యాయమూర్తి, అల్లు అర్జున్‌కు 14 రోజుల రిమాండ్‌ విధించినట్లు తెలుస్తోంది. ఆయనను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు. ఇదిఎలా ఉంటె తనపై నమోదైన కేసులను క్వాష్‌ చేయాలని అల్లు అర్జున్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈకేసులో ప్రస్తుతం హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. హైకోర్టు తీర్పు అనంతరం అల్లు అర్జున్‌ రిమాండ్‌పై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :