ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / వరంగల్ జిల్లా : లంబాడీలకు వెంటనే మంత్రి వర్గంలో చోటు కల్పించాలని ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు నరసింహ నాయక్ డిమాండ్ చేసారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 9 మాసాలు గడిచిన గాని ఇంతవరకు మా లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో మా లంబాడీలు కీలక పాత్ర పోషించారు , తెలంగాణ రాష్ట్ర మొత్తంలో 12% మంది గిరిజనులు ఉన్నాగాని ఇంతవరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించకపోవడం బాధాకరమన్నారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం విస్తరించే క్యాబినెట్ లో తప్పకుండా మా లంబాడీలకు వెంటనే మంత్రి పదవి ప్రకటించాలని విజ్ఞప్తి చేసారు. రాష్ట్ర ప్రబుత్వం లో లంబాడాలకు మంత్రి పదవి తో పాటు సముచిత స్థానం కల్పించాలని లేని ఎడల మా లంబాడీలంతా కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకీ గుణపాఠం చెప్తాం, అలాగే మా హక్కుల కొరకు రాష్ట్రవ్యాప్తంగా తప్పకుండా పోరాటం చేస్తామని నరసింహ నాయక్ తెలిపారు.
Admin
Aakanksha News