ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లుల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం సాధికారికంగా ముందడుగు వేయకుండానే,రాష్ట్ర గవర్నర్‌తో బీసీ బిల్లులను ఆమోదింపజేసే ప్రయత్నాన్ని సీరియస్‌గా చేయకుండా, రాజకీయ ప్రహసనంగా వ్యవహరించడాన్నిరాష్ట్ర బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు తప్పు పట్టారు.కేంద్ర ప్రభుత్వం బీసీల విషయమై గణనీయంగా చేసింది ఏమీ లేదు. బీసీలకు అనుకూలంగా వ్యవహరించలేదు.దేశం మొత్తం బీసీలు కులగణనను డిమాండ్ చేస్తుంటే కూడా కేంద్రం పట్టించుకోకపోవడం బాధాకరం.అయినా, ఈ సమయంలో కేంద్రంపై విమర్శలు చేయడం సరైనది కాదు.బిల్లును 9వ షెడ్యూల్‌లో చేర్చించేందుకు కేంద్రంతో సుహృద్భావం వ్యవహరించి, రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఉంది,” అని డా. వకుళాభరణం స్పష్టం చేశారు.ఢిల్లీలో బీసీ సంఘాలు నిర్వహించిన ధర్నా శాంతియుతంగా, నిబద్ధతతో సాగిందని, ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకెళ్లే ధర్మపోరాటంగా అభివర్ణించారు.బీసీలు చేస్తున్నది ధర్మపోరాటమేనని, ఇది రాష్ట్రంలో బీసీ చైతన్యానికి ప్రతీకగా, రానున్న రోజులలో రాజ్యాధికార సాధనకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు.అయితే, ఆ ధర్నాను ఆధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు, మంత్రులు, ప్రజాప్రతినిధులురాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.బిల్లులు గవర్నర్ ఆమోదం పొందకముందే ఢిల్లీకి వెళ్లి ధర్నాలు చేయడం వల్ల బీసీలకు న్యాయం జరగదని,ప్రజలను తప్పుదారిలో నడిపించే అవకాశాన్ని ప్రభుత్వానికి ఇవ్వడం సముచితం కాదు అని డా. వకుళాభరణం తెలిపారు.రాష్ట్రంలో కుల గణన చేపట్టడం గొప్ప విషయం.అయితే ఎన్నో సూచనలు చేసినప్పటికీ, పెడ చెవినా రాష్ట్ర ప్రభుత్వం తనదైన నిర్లక్ష్య వైఖరిని కొనసాగించడం పట్లమేము వ్యతిరేకం వ్యక్తం చేయక తప్పడం లేదు. జరిగిన పొరపాట్లను సరైన రీతిలో సరిదిద్దే పని చేయలేదు,” అన్నారు డా. వకుళాభరణం.56 శాతం జనాభా ఉన్నా… 21 శాతం మాత్రమే రిజర్వేషన్తెలంగాణలో బీసీల జనాభా 56 శాతానికి పైగా ఉన్నా, విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్ 29 శాతానికి మించదు.స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ప్రస్తుతం 21 శాతమే రిజర్వేషన్ ఉంది.ఈ అసమానతల నేపథ్యంలో 42 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లులను శాసనసభ, మండలిలో ఏకగ్రీవంగా ఆమోదించినట్టు గుర్తు చేశారు.కుల గణాంకాల ఆధారంగా తీసుకొచ్చిన ఈ బిల్లులు శాస్త్రీయంగా, న్యాయబద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు.గవర్నర్ ఆమోదం తర్వాతే కేంద్రం చర్యలుతమిళనాడులో 69 శాతం రిజర్వేషన్ చట్టాన్ని 9వ షెడ్యూల్‌లో చేర్చినట్టు,తెలంగాణ బిల్లును కూడా కేంద్రం 9వ షెడ్యూల్‌లో చేర్చాలంటే గవర్నర్ ఆమోదం అనంతరం చట్టం అమల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు.గవర్నర్ ఆమోదం లేకుండానే కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం రాజ్యాంగ వ్యవస్థకు విరుద్ధమని హెచ్చరించారు.ప్రభుత్వ నిర్లక్ష్యం ఆందోళనకరంబిల్లులు తెచ్చినప్పటికీ, వాటి అమలుకు అవసరమైన ప్రక్రియలో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు.గవర్నర్ ఆమోదం కోసం అధికారిక కృషి లేకుండా, ప్రత్యక్ష న్యాయ చట్ట ప్రక్రియలు చేపట్టకుండా,ప్రజల్లో కేంద్రంపై వ్యతిరేకత సృష్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం నిర్వీర్యతకు దారితీస్తుందని హెచ్చరించారు.బీసీ హక్కులను నిర్వీర్యంగా మారకుండా రక్షించాలంటే ప్రభుత్వం చట్టబద్ధమైన మార్గాన్ని అనుసరించాలని డా. వకుళాభరణం అన్నారు.చివరగా…“42 శాతం రిజర్వేషన్ సామాజిక న్యాయం సాధనలో కీలకమైన అడుగు.దీనిని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సమంజసం కాదు.గవర్నర్ ఆమోదం వచ్చిన తర్వాతే కేంద్రంతో చర్చలు జరిపి, పార్లమెంట్ ద్వారా 9వ షెడ్యూల్‌లో చేర్చే ప్రక్రియను ప్రారంభించాలి.ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రామాణిక గణాంకాలు, న్యాయపరమైన నివేదికలు, విధివిధానాలు సిద్ధం చేయాలి.పార్లమెంట్ రెండు సభల్లో ఆమోదం పొందే ప్రక్రియను తేలికగా తీసుకోవడం అనవసరం.రాజకీయ ప్రచారాలతో కాదు, చట్టపరమైన ధోరణితో, కేంద్రంతో సుహృద్భావంతో ముందుకు సాగాలి.లేకపోతే బీసీలకు అన్యాయం జరగే ప్రమాదం లేకపోలేదు,” అని డా. వకుళాభరణం హెచ్చరించారు.
Admin
Aakanksha News