ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 21 మంది ఐపిఎస్‌లను బదిలీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ఒక అడిషనల్ డిజి, ఇద్దరు ఐజిపిలు, ఇద్దరు డిఐజిలు బదిలీ అయ్యారు. అదనపు డిజి(పర్సనల్)గా అనిల్ కుమార్‌ని బదిలీ చేస్తూ.. ఎస్‌పిఎఫ్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. సిఐడి ఐజిగా ఎం.శ్రీనివాసులు, సిఐడి ఎస్పిగా సి.రవీందర్, రామగుండం సిపిగా అంబర్ కిషోర్ ఝా, వరంగల్ సిపిగా సన్‌ప్రీత్ సింగ్, వరంగల్ డిసిపిగా అంకిత్ కుమార్, ఇంటెలిజెన్స్ ఎస్పిగా సింధూశర్మ, మహిళ భద్రత విభాగం ఎస్పిగా చేతన, నార్కోటిక్ బ్యూరో ఎస్పిగా రూపేష్, కామారెడ్డి ఎస్పిగా రాజేశ్ చంద్ర, నిజామాబాద్ సిపిగా సాయి చైతన్య, సంగారెడ్డి ఎస్పిగా పారితోష్ పంకజ్, భువనగిరి డిసిపిగా ఆక్షాన్స్ యాదవ్, కరీంనగర్ సిపిగా గౌస్ ఆలం, ఆదిలాబాద్ ఎస్పిగా అఖిల్ మహాజన్, సిరిసిల్ల ఎస్పిగా గీతే మహేశ్ బాబా సాహేబ్, మంచిర్యాల డిసిపిగా భాస్కర్, పెద్దపల్లి డిసిపిగా కరుణాకర్, హైదరాబాద్ సెంట్రల్ జోన్ డిసిపిగా శిల్పవల్లి, సూర్యాపేట ఎస్పిగా నరసింహలను బదలీ చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేశారు.
Admin
Aakanksha News