ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : తెలంగాణలో ప్రశ్న పత్రాల లీకుల వ్యవహారం కలకలం సృష్టిస్తుంది. లక్షల మంది నిరుద్యోగులు ఎంతో ఆశతో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొని వేల రూపాయలు పెట్టి కోచింగ్ తీసుకున్న అభ్యర్థులకు గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇప్పటికే పూర్తయిన గ్రూపు 1 పరీక్షతో పాటు ఏఈఈ ,డి ఏ ఓ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు TSPSC అధికారులు సమావేశం తర్వాత వెల్లడించారు. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షని జూన్ 11న నిర్వహిస్తామని మిగతా పరీక్షలకు సంబంధించి మళ్లీ తేదీని ఖరారు చేస్తామని ప్రకటనలో తెలిపారు.
Admin
Aakanksha News