Tuesday, 28 July 2026 08:09:36 AM

ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి..

గోదావరి నదిపై వెంటనే ప్రభుత్వం పెన్షింగ్ ఏర్పాటు చేయాలి...టిడిపి బృందం

Date : 24 May 2023 05:12 PM Views : 817

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : గోదావరి నదిపై దాదాపుగా 100 నుండి 400మంది వరకు గోదావరి బ్రిడ్జి పై నుండి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారని రాష్ట్ర టిఎన్టియుసి వర్కింగ్ ప్రెసిడెంట్, టిడిపి రాష్ట్ర మాజీ కార్యదర్శి నిమ్మకాయల ఏడుకొండలు అన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ముక్కుపచ్చలారని రెండు నెలల పసి పాపని ఓ తల్లి నదిలో విసిరి. అనంతరం తల్లి ఆత్మ చేసుకుందామని ప్రయత్నించగా ఆటో డ్రైవర్ తో పాటు అక్కడున్న రివర్ పోలీస్ లు కాపాడారని ఈ ఘటనలో పాప మృతి చెందడం ఎంతో బాధాకరం అని పేర్కొన్నారు. బుధవారం టిడిపి బృందం గోదావరి నది బ్రిడ్జిని పరిశీలించారు. ప్రజల రవాణా సౌకర్యం కొరకు వంతెనను ప్రారంభించారని, కొందరు క్షణికావేశంలో జీవితంపై విరక్తితో ఇలాంటి చర్యలకు కోరుకుంటున్నారని అందుకు ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ప్రభుత్వం గానీ కార్పొరేషన్ అధికారులు కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.నదిపై ఇరువైపులా పెన్షింగ్ ఏర్పాటు చేయాలని కార్పొరేషన్ కు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసిన దున్నపోతుపై వాన పడ్డట్లుగానే అధికారులు వ్యవహరిస్తున్నారని, ఇంకెంతమంది ప్రాణాలు పోతే పట్టంచుకుంటారో పాలకులు చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇప్పటికైనా బ్రిడ్జిపై ఫ్రెన్సిగ్ వేసి కట్టుదిట్టమైన రక్షణ చర్యలు చేపట్టాలని టిడిపి పరంగా అదేవిధంగా సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ పరంగా డిమాండ్ చేస్తూన్నామని అన్నారు. లేని పక్షంలో ఈ కార్మికులతో మమేకమై కార్పొరేషన్ ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కంది చంద్రయ్య టిఎన్టియుసి ప్రధాన కార్యదర్శి లేబర్ యూనియన్ ఉపాధ్యక్షులు ముదిగంటి దామోదర్ రెడ్డి జిల్లా టిఎన్టియుసి అధ్యక్షులు పెగడపల్లి రాజనర్సు సింగరేణి లేబర్ యూనియన్ కోశాధికారి ఆఫీస్ అండ్ ప్రెస్ ఇన్చార్జి సుందిళ్ల స్వామి టిడిపి సీనియర్ నాయకుడు తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :