Tuesday, 28 July 2026 07:18:26 AM

పంచాయతీరాజ్ ఎన్నికలలో చట్ట ప్రకారం రిజర్వేషన్స్ పెంచాలి..

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్

Date : 12 February 2025 08:38 PM Views : 474

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : పంచాయతీరాజ్ ఎన్నికల్లో పార్టీ పరంగా 42 శాతం కాదు, చట్ట ప్రకారం పెంచాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీ ఆర్.కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందుకోసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో నీల వెంకటేష్ అధ్యక్షతన 14 బిసి సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ఆర్.కృష్ణయ్య హాజరై మాట్లాడుతూ పంచాయతీరాజ్ ఎన్నికలలో బీసీలకు పార్టీ పరంగా 42 శాతం కోటా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో పార్టీ పరంగా 42 శాతం ఇస్తే బీసీలకు న్యాయం జరగదని అన్నారు. ఇతర పార్టీల వారు కూడా అంగీకరిస్తే అప్పుడు న్యాయం జరుగుతుందన్నారు. లేకపోతే అగ్రకులాలకు ఇస్తే డబ్బుతో పోటీ పడలేరని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఎలాంటి వివాదాలకు తావు లేకుండా అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లు 42 శాతంకు పెంచుతూ బిల్లు పెట్టి చట్టం చేయాలన్నారు. అప్పుడు అన్ని పార్టీలు కూడా బిసిలకు ఇస్తాయని, తద్వారా తప్పని సరిగ్గా బీసీలు గెలుస్తారన్నారు. ఈ సమావేశంలో వేముల రామకృష్ణ, గొరిగె మల్లేష్ యాదవ్, మోదీ రాందేవ్, కీర్తి లత.. ఉదయ్,శివకుమార్, రవి యాదవ్, శివ, బాలస్వామి జయంతి, నందగోపాల్. తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :