Tuesday, 28 July 2026 12:10:34 PM

ప్రజా శాంతి పార్టీలో చేరిన సినీ నటుడు బాబూ మోహన్...

Date : 04 March 2024 06:56 PM Views : 479

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : ప్రముఖ సినీ నటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్ ప్రజా శాంతి పార్టీలో చేరారు. సోమవారం కేఏ పాల్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆయన వరంగల్‌ నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కాగా, ఇటీవలే బాబూ మోహన్ బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. బీజేపీ పార్టీ తనని తీవ్ర నిర్లక్ష్యానికి గురిచేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆ పార్టీ పెద్దల వైఖరిపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా బాబూ మోహన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చివరకు ఆయనకు అందోల్ నుంచి బీజేపీ టికెట్ ఇచ్చింది. ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన దామోదర రాజనరసింహ గెలిచారు. బీఆర్‌ఎస్‌ నుంచి చంటి క్రాంతి కిరణ్‌ రెండో స్థానంలో నిలువగా బాబూ మోహన్ మూడో స్థానానికే పరిమితమయ్యారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :