Tuesday, 28 July 2026 12:22:04 PM

బొకేలకు బదులుగా మంచి పుస్తకాలు ఇవ్వాలి...

తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

Date : 29 December 2024 05:43 AM Views : 472

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : ఏవైనా శుభకార్యాలకు వెళ్లినప్పుడు అందరూ బొకేలకు బదులుగా మంచి పుస్తకాలు ఇవ్వాలని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సూచించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బుక్ ఫెయిర్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పుస్తకాల్లో అనంతమైన జ్ఞానం ఉందన్నారు. పుస్తకాలను నమిలి మింగేసేంత క్షుణ్ణంగా చదవాలని సూచించారు.ఈ-బుక్స్‌లలో కంటే పుస్తకాల్లోనే ఎక్కువ మజా ఉంటుందని గవర్నర్‌ జిష్ణుదేవ్‌ తెలిపారు. పుస్తకాలు చదువుతుంటే రచయితతో నేరుగా మాట్లాడుతున్నట్లుగా ఉంటుందన్నారు. విశ్వం గురించి తెలియాలంటే పుస్తకాలు చదవాల్సిందేనని చెప్పారు. నిరక్షరాస్యులకు ఆడియో బుక్స్ కూడా అందుబాటులోకి వచ్చాయని గుర్తుచేశారు. నేటి యువత పుస్తకాల వైపు మళ్లేలా పెద్దలు ప్రోత్సహించాలని చెప్పారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :