ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ప్రధాన ఆలయంలో భారీ ఎత్తున వెండి సామగ్రిని దొంగలు ఎత్తుకెళ్లారు. పోలీసులు ఆలయానికి చేరుకుని, విచారణ చేపట్టారు. విచారణ పూర్తయ్యే వరకు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. భద్రత ఉన్నప్పటికీ దొంగతనం జరగడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఆలయం వెనుక వైపు ద్వారముల నుండి అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత చొరబడిన ఇద్దరు దొంగలు ఈ చోరీకి పాల్పడినట్లు సమాచారం. దీంతో సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. 6 మంది హోంగార్డులు రాత్రి డ్యూటీ లో ఉన్నట్లు సమాచారం.స్వామివారి శఠగోపంతో పాటు మరికొన్ని వెండి వస్తువులని దొంగిలించినట్లు సమాచారం. కేవలం ఒక నిమిషం లో ఈ ఘటనా జరిగిందని పోలీసులు నిర్దారణకు వచ్చినట్లు సమాచారం.
Admin
Aakanksha News