Sunday, 26 April 2026 05:59:09 PM

నేడు ఈడీ విచారణకు హాజరుకానున్న టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత

Date : 11 March 2023 09:55 AM Views : 330

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కామ్​లో ఈడీ విచారణకు నేడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత హాజరుకానున్నారు. ఢిల్లీ ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డులోని ఈడీ హెడ్ ఆఫీసుకు ఉదయం 10 గంటల 30 నిమిషాల వరకు ఆమె చేరుకోనున్నారు. 11 గంటలకు కవితను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ కేసులో హైదరాబాద్​కు చెందిన లిక్కర్ వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లై, బ్రిండ్‌‌‌‌కో సేల్స్ డైరెక్టర్ అమన్ దీప్ సింగ్ ధాల్, ఆడిటర్ బుచ్చిబాబు, అభిషేక్ బోయినపల్లి ఇచ్చిన స్టేట్​మెంట్ల ఆధారంగా కవితకు ఈడీ ఈ నెల 8న నోటీసులు ఇచ్చింది. 9న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. అయితే ముందుగా అనుకున్న షెడ్యూల్ కారణంగా 9వ తేదీన హాజరు కాలేనని ఈడీ అధికారులకు తెలుపడంతో 11వ తేదీన హాజరుకావాలని తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :