ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని సిసిసి నస్పూర్ ఎస్సై రవికుమార్ తన సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా రాయల్ టాకీస్ చౌరస్తా వద్ద నిందితున్ని పోలీసులు గమనించారు. దీంతో పోలీసులను గమనించిన నిందితుడు అనుమానాస్పద స్థితిలో ద్విచక్ర వాహనంపై పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా చాకచక్యంగా పట్టుకున్నారు. దీంతో నిందితున్ని విచారించగా గతంలో చేసిన నేరాలన్నీ ఒప్పుకున్నట్లు సీపీ తెలిపారు.ఈ మేరకు వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితుడి వివరాలను రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామగుండం సీపీ రేమా రాజేశ్వరి వివరాలను వెల్లడించారు.ఈ సందర్భంగా రామగుండం సీపీ రేమా రాజేశ్వరి మాట్లాడుతూ.. మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్ లోని సిర్కే కాలానికి చెందిన రాజావరపు వెంకటేష్ రామగుండం కమిషనరేట్ పరిధిలో ఇప్పటివరకు 72 దొంగతనాలకు పాల్పడ్డాడని తెలిపారు. నెల్లూరుకు చెందిన వెంకటేష్ మంచిర్యాల జిల్లాకు చెందిన యువతుని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నిందితుడు మద్యానికి బానిసగా మారి ఆన్ లైన్ బెట్టింగ్ లకు పాల్పడుతూ తన విలాసవంతమైన జల్సాల ఖర్చులకోసం దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ఇప్పటివరకు నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 07, దొంగతనాలు, లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 06, చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 07, మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో 11, రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 17, కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 02, శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 01, మంచిర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో 05, గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 14, భీమారం పోలీస్ స్టేషన్ పరిధిలో 02 దొంగతనాలకు పాల్పడ్డాడు. నిందితుడు చోరీకి పాల్పడిన 72 కేసులలో 2.89 కేజీల బంగారం, 4.07 కేజీల సిల్వర్, 19 లక్షల నగదు మొత్తం ఈ చోరీల విలువ సుమారు 1కోటి 20 లక్షల రూపాయలని రామగుండం సీపీ వెల్లడించారు. నిందితుడు దొంగతనాలకు ఉపయోగించిన నాలుగు ద్విచక్ర వాహనాలు, ఒక్క కారు, ట్రాలిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్న మంచిర్యాల డిసిపి సుధీర్ కేకన్ రామనాధ్, మంచిర్యాల ఏసిపి తిరుపతిరెడ్డి, సిసిసి నస్పూర్ ఎస్సై రవికుమార్, హాజీపూర్ ఎస్సై ఉదయ్ కిరణ్, తదితర సిబ్బందిని రామగుండం సీపీ ప్రత్యేకంగా అభినందించారు.
Admin
Aakanksha News