Wednesday, 29 July 2026 11:09:33 AM

చంచల్ గూడ జైలు నుండి విడుదలైన అల్లు అర్జున్...

Date : 14 December 2024 09:44 AM Views : 575

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : పుష్ప-2 విడుదల సందర్బంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కేసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన కేసులో అరెస్టు అయిన సినీ నటుడు అల్లు అర్జున్ కొద్దీ సేపటి క్రితం జైలు నుండి విడుదల అయ్యారు. అయితే ఈ కేసులో నాంపల్లి కోర్టు రిమాండ్ విధించగా హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆలస్యంగా తీర్పురావడం, బెయిల్ మంజూరు పత్రాలు సమర్పించే విషయంలో ఆలస్యం కావడంతో అల్లు అర్జున్ జైలులోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో జైలు శాఖ అధికారులు మంజీరా బ్యారక్‌లో ఏర్పాట్లు చేశారు. అర్దరాత్రి వరకు కూడా అల్లు అర్జున్ విడుదల కోసం అల్లు అరవింద్ జైలు వద్ద చాాలా సేపు వేచి చూశారు. విడుద లలో జాప్యం జరగటంతో… జైలు వద్ద నుంచి అల్లు అరవింద్ వెళ్లిపోయారు. తమ అభిమాన హీరోకి మద్దతుగా పెద్ద ఎత్తున అభిమానులు వస్తున్న సందర్బంగా ఈ క్రమంలో జైలు పరిసర ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. మరోవైపు అల్లు అర్జున్ నివాసం వద్ద కూడా అభిమానుల సందడి ఉంది. దీంతో అక్కడ కూడా పోలీసులు… భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :