Wednesday, 29 July 2026 12:11:49 PM

రూ.80 వేలు దాటిన తులం బంగారం....

Date : 26 October 2024 06:50 PM Views : 410

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / ఆకాంక్ష డెస్క్ : పసిడి కొనుగోలుదారులకు బ్యాడ్ న్యూస్. బంగారం ధరలు సామాన్య జనాలకు షాకిస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్ వస్తుండటంతో మరోసారి బంగారం ధరలు భారీగా పెరిగాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా రికార్డు స్థాయిలో తులం బంగారం రూ.80 వేలు దాటింది. తాజాగా శనివారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.710, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.650 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం ధర రూ.80,290కు చేరింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,600గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.1,07,000గా ఉంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :