Tuesday, 28 July 2026 08:29:11 AM

కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి.

సీపీఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి ఈ నరేష్

Date : 17 February 2023 02:26 PM Views : 501

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ అంతర్గాం మండల కేంద్రంలో సిపిఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ ఆద్వర్యంలో ప్రజా సమస్యల పై కేసీఆర్ ప్రభుత్వం స్పందించాలని నిరుపేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఫించ్చన్లు, ధళితులకు ధళిత బందు, మూడెకరాల భూమి, కొత్త రేషన్ కార్డులు, రైతులకు 24 గంటల ఉచిత కరెంట్, సాగు నీరు, త్రాగు నీరు ఇవ్వాలని కోరుతూ ర్యాలీ నిర్వహించి తహసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం ప్రజా సమస్యలపై తహసిల్దార్ కు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా సిపిఐ (ఎం ఎల్) 4 పెద్దపల్లిW డివిజన్ కార్యదర్శి ఈ నరేష్ మాట్లాడుతూ నిరుపేద ప్రజలందరూ ఇండ్లు లేక జాగలు లేక ఎలాంటి ఆధారం లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు,కొత్తగా దరఖాస్తులు చేసుకున్న వారందరికీ రేషన్ కార్డులు,పింఛన్లు ఇవ్వలన్నారు.అలాగే దళిత బంధు,దళితులకు మూడెకరాల భూమి ఇవ్వాలని రైతులకు రుణమాఫీ చేయాలని వ్యవసాయానికి తగిన సాగునీరు అందక పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతతున్నారని రైతులు తెచ్చుకున్న అప్పులు కట్టలేక అవస్థలు పడుతున్నారని అన్నారు. పంటలకు సాగునీరు తాగునీరు అందించి రైతులను ఆదుకోవాలన్నారు.రైతాంగానికి 24 గంటల కరెంటును నిరంతరాయంగా అందిస్తున్నామని ప్రచార ఆర్భాటాలు తప్ప కేసీఆర్ ప్రభుత్వం 24 గంటల కరెంటు ను కోతలు లేకుండా అందించడంలో వైఫల్యం చెందిందన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రభుత్వం నేటికీ ఎక్కడ పూర్తి స్థాయిలో నిర్మాణం కానీ కట్టిన ఇండ్లు పూర్తిగా ఇవ్వడం జరగలేదన్నారు.అలాగే కొత్త రేషన్ కార్డుల కొరకు అనేక మంది దరఖాస్తులు పెట్టుకొని సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ ఇవ్వనేలేదని పేర్కొన్నారు.మరోసారి కేసీఆర్ ప్రభుత్వం ప్రజలని మబ్య పెట్టి ఆశలు కల్పించే ప్రయత్నాలు చేస్తుందని గతంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ పూర్తిస్థాయిలో అమలు చేయాలన్నారు.అలాగే పెద్దంపేట్ గ్రామంలో గత 70 ఏళ్ళనుండి అక్కడి పేద రైతులు సాగు చేసుకుంటున్న ఖుర్షికమ్మి భూములకు తక్షణమే పట్టాలు ఇచ్చి రైతుల ను ఆదుకోవాలన్నారు.లేని పక్షంలో సీపీఐ(ఎం ఎల్) న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టవల్సి వస్తుందని నరేష్ హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో కొల్లూరి మల్లేష్ మండల కార్యదర్శి, కోడిపుంజుల జ్యోతి పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు,మెరుగు చంద్రయ్య మండల సహాయ కార్యదర్శి,డివిజన్ నాయకులు సిహెచ్ అబేద్నేగో, కె మొగిలి, కె లింగమూర్తి,మండల నాయకులు వేల్పుల సాంబయ్య ,ఉప్పులేటి నరసయ్య, బొంతు ఆనంద్, పైడిపల్లి రమేష్ ,ఎస్ తిరుపతి, టి రాజ కొమురయ్య, మాడ మల్లేష్ ఆరుముళ్ళ తిరుపతి, టి నవీన్, మాలెం తిరుపతి, జి లక్ష్మణ్,ఇ బాబు,నల్లతీగల రమేష్,కాసర్ల మల్లేశ్, అనసూర్య,రాజేశం.తదితరులు పాల్గోన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :