ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / జనగామ జిల్లా : ఎంతో మంది బడా సంపన్నులు లక్షల రూపాయలు బిజినెస్ పేరుతో అప్పు తీసుకొని కట్టకున్న పట్టించుకోని అధికారులు సామాన్యులపై ప్రతాపం చూపించడంపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇలాంటి ఘటనే జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. దేవరుప్పుల మండలం పెదతండాకు చెందిన గుగులోత్ లక్ష్మి మహిళా సంఘం తరుపున తెలంగాణ గ్రామీణ బ్యాంకులో రూ.61 వేలు అప్పు తీసుకుంది. అయితే అప్పు కట్టలేదని ఇంటి ముందు బ్యాంకు అధికారులు పొయ్యి పెట్టి వంటావార్పు చేశారు.ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.బ్యాంకు అధికారుల తీరుపై మండిపడుతున్నారు.
Admin
Aakanksha News