ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : RFCL ఆర్ఎఫ్ సీఎల్ లో ఉద్యోగాల పేరుతో మోసపోయిన బాధితులకు భరోసగా నిలవాలని కార్మిక సంఘాలు పిలపునిచ్చాయి. ఈ సందర్భంగా గోదావరిఖని తిలక్ నగర్ లోని ఐఎఫ్టియు కార్యాలయంలో.కే విశ్వనాథ్ అధ్యక్షతన కార్మిక సంఘాల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఏఐటీయూసీ,ఐ ఎన్ టీయూసీ ఐఎఫ్టియూ, ఎస్ కె ఎస్, అసంఘటిత కార్మిక సంఘం, మల్టిపుల్ వర్కర్స్ యూనియన్ కార్మిక సంఘాల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో పలువురు కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ.... కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక సంఘాలను వాటి పాత్రను నిర్వీర్యం చేయాలని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాయని విమర్శించారు. ఇందులో భాగంగానే రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఆర్ఎఫ్ సీఎల్ లో కార్మిక సంఘాల పాత్ర లేకుండా చేయడానికి పాలక వర్గాలు తీవ్ర కృషి చేస్తున్నాయని దాని మూలంగా ఆర్ ఎఫ్ సీ ఎల్ లో ఉద్యోగాలు పెట్టిస్తామని మాయగాళ్లు ప్రజా ప్రతినిధుల అడ్డతో పాలక వర్గాల కను సైగలలో కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని పేర్కొన్నారు. వీటి విషయంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోక పోవడం అనేక అనుమానాలకు తావిస్తుందని అభిప్రాయ పడ్డారు.ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో పౌరహక్కులు మానవ హక్కుల మేధావులతో కమిటీ వేసి ఎవరెవరి పాత్ర ఎంత ఉందో నిజాలు నిగ్గు తేల్చడానికి యుద్ధ ప్రతిపాదికన ఒక కమిటీని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఒక్కొక్కరి దగ్గర తీసుకున్న 12 లక్షల రూపాయలు ఒకే సారీ బాధితులకు పూర్తి డబ్బులు చెల్లించి ఉద్యోగ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం చేస్తామనే సాకుతో కొందరు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా వ్యవహారం నడిపిస్తూ బాధితుల నోట్లో మట్టి కొట్టాలని చూస్తున్నారని అన్నారు.వెంటనే ప్రభుత్వ అధికారులు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సిబిఐ తో విచారణ చేపట్టాలని బాధితుల డబ్బులు పక్కదారి పట్టకుండా బాధితులకు నేరుగా చేరే విధంగా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం అధికారికంగా ఒక కమిటీని నియమించాలని లేనిపక్షంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బాధితులకు భరోసాగా పోరాటాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు.ఈ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు. కే విశ్వనాథ్ క డారి సునీల్. పూసల తిరుపతి. బి కృష్ణ.ఈ రాజేశం మార్త రామన్న సంఘం రాజు.ఏడు కొండలు, శంకరన్న, గొల్లపల్లి చంద్రన్న తదితరులు పాల్గొన్నారు
Admin
Aakanksha News