ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / సిద్దిపేట జిల్లా : ప్రకృతిని, పూలను దేవతగా కొలిచే బతుకమ్మ పండుగ ప్రపంచ సంస్కృతీ సాంప్రదాయాల్లోనే ప్రత్యేకతను చాటుకుందని, తరతరాలుగా మహిళా సామూహిక శక్తికి ఐక్యతకు దర్పణమైన బతుకమ్మ పండుగ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజల అస్తిత్వ ఆకాంక్షలకు వేదికగా నిలిచిందని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లిల్లీ మేరి అన్నారు. నేడు ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో జరిగిన బతుకమ్మ వేడుకలలో ఆమె మాట్లాడుతూ ఎంగిలి పూలతో ప్రారంభమై సద్దులతో ముగిసే తొమ్మిది రోజుల బతుకమ్మ సందర్భంగా పల్లెలు, పట్టణాలు బేధం లేకుండా మహిళలతో, పిల్లా, పాపలతో ప్రత్యేక సందడి నెలకొంటుందని లిల్లీ మేరి తెలిపారు. తీరొక్క పూలతో పేర్చే బతుకమ్మ ప్రకృతి ఆరాధనకు ప్రతీక అని, ఏ దేవుడైన కొలవటానికి అందరూ పూలను ఉపయోగిస్తే, ఆ పూలనే దేవతగా కొలిచే గొప్ప సంప్రదాయం బతుకమ్మ అని లిల్లీ మేరి అన్నారు.
Admin
Aakanksha News