ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : రామగుండం పర్యటనకు నవంబర్ 12వ తేదీన రామగుండం ఫెర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ ను జాతికి అంకితం చేసేందుకు రామగుండంకు దేశప్రధాని నరేంద్రమోడీ విచ్చేస్తున్న సందర్భంగా 16వ డివిజన్ కార్పొరేటర్ మందల కిషన్ రెడ్డి వాల్ పోస్టర్ ను గురువారం మాజీ ఎమ్మెల్యే మాజీ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలోని బిజెపి శ్రేణులు నాయకులు, కార్యకర్తలు,కార్మికులు, రైతులు అందరు కూడా అంబేద్కర్ స్టేడియంలో జరిగేటువంటి మీటింగ్ కు హాజరుకాగలరని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సోమారపు అరుణ్ కుమార్ ఓబీసీ మోర్చా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు, పిడుగు కృష్ణ,మంచికట్ల భిక్షపతి,మాడ నారాయణ రెడ్డి,బద్రి దేవేందర్, కుసుమ, మిట్టపల్లి సతీష్,కటకం సతీష్,తోకలు అనురాగ్, పానుగంటి రాము తదితరులు పాల్గొన్నారు
Admin
Aakanksha News