ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : రైతు కమిషన్ కార్యాలయంలో ఉద్యాన వన పంటలపై ఆ శాఖ ఉన్నతాధికారులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, కమిషన్ సభ్యులు కేవీఎన్ రెడ్డి, రాంరెడ్డి గోపాల్ రెడ్డి, భవానీ రెడ్డి తోపాటు హార్టికల్చర్ డైరెక్టర్ ఐఏఎస్ షేక్ యాస్మిన్ బాషా, ఉద్యానవన శాఖ అధికారి బాబు, రైతు కమిషన్ ఏడీఏ అధికారి సంధ్యారాణి, వ్యవసాయ అధికారి హరి వెంకట ప్రసాద్, సుస్థిర వ్యవసాయ ప్రతినిధి భాస్కర్ పాల్గొన్నారు. రాష్ట్రంలో కూరగాయల పంటల సాగుపై దృష్టి సారించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన కమిషన్ ఫెస్టిసైడ్ వాడకం తగ్గించేలా చూడాలని అధికారులకు చెప్పిన కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి వచ్చేలా కూరగాయల సాగు అవుతున్నాయని, దాని ద్వారా రైతులు, వినియోగదారులు అనారోగ్యానికి గురవుతున్నారు సేంద్రియ సాగు ను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. వంకాయ, బెండకాయ సాగులో విపరీతంగా ఫెస్టిసైడ్ వాడుతున్నట్లు అధికారులు కమిషన్ దృష్టికీ తెచ్చారు క్లస్టర్ సాగులను ప్రోత్సహించాలన్నారు కమిషన్ చైర్మన్. ప్రభుత్వ సబ్సీడీలను క్లస్టర్ విధానంలో సాగుచేసే రైతులకు మరింత చేరేలా చూడాలన్నారు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటలు సాగుచేసే రైతులతో సమావేశాలు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలన్నారు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి దిశానిర్దేశం చేశారు త్వరలో హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలో కూరగాయలు సాగయ్యే తోటలను సందర్శించి రైతులతో ముఖాముఖీ కార్యక్రమాన్ని పెట్టాలని కమిషన్ ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుందిఅదేవిదంగా పురుగు మందులను విచ్చలవిడిగా వాడకాన్ని కట్టడి చేయడానికి మండల వ్యవసాయ అధికారి దృష్టి సారించాలన్నారు. దానిపై రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి అధికారులు మానిటరింగ్ చేయాలన్నారు.
Admin
Aakanksha News