Friday, 12 June 2026 12:44:13 AM

హైదరాబాద్‌ శివారులో మినీ లారీ బోల్తా....

Date : 07 January 2026 01:39 PM Views : 414

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : హైదరాబాద్‌ శివారులో మినీ లారీ బోల్తా పడిన ఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. ఆరాంఘర్ నుంచి అత్తాపూర్ వైపు ఇటుకల లోడ్‌తో వెళ్తున్న మినీ లారీ శివరాంపల్లి వద్ద పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నంబర్‌ 289 సమీపానికి చేరుకోగానే టైరు పేలింది. దీంతో లారీ అదుపు తప్పి రోడ్డుపై బోల్తా పడింది.ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఘటన సమయంలో వెనుకవైపు ఇతర వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు పోలీసులు తెలిపారు. లారీ బోల్తా పడటంతో రోడ్డుపై ఇటుకలు చెల్లాచెదురుగా పడ్డాయి. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు జీహెచ్‌ఎంసీ జేసీబీ సహాయంతో రోడ్డుపై పడిన ఇటుకలను తొలగించారు.లారీ రోడ్డుకు అడ్డంగా ఉండటంతో కొంతసేపు ట్రాఫిక్ స్తంభించింది. అనంతరం వాహనాన్ని పక్కకు తరలించి రాకపోకలను పునరుద్ధరించారు. పోలీసులు ఘటనపై వివరాలు సేకరించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :