Tuesday, 28 July 2026 05:09:42 AM

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

Date : 18 April 2023 10:03 PM Views : 1410

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / సూర్యాపేట జిల్లా : రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టులందరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సూర్యాపేట జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఐతబోయిన రాంబాబు గౌడ్, పాల్వాయి జానయ్య డిమాండ్ చేశారు.మంగళవారం టీడబ్ల్యూజెఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ సెంటర్ లో ఇళ్ల స్థలాల సాధన కోసం సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు తొమ్మిదేళ్లు కావస్తున్నా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ఇంత వరకు నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారం కోసం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కృషి చేస్తుందన్నారు.సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన విధంగా ఇళ్ల స్థలాల సాధన అనేది జర్నలిస్టుల హక్కు అని, అందుకే ప్రభుత్వం వెంటనే స్పందించి స్థల సేకరణ జరిపి అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.జిల్లా కమిటీ పిలుపు మేరకు యూనియన్లకు అతీతంగా స్పందించి సంతకాల సేకరణ కార్యక్రమానికి సంఘీభావం తెలిసిన జర్నలిస్టులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జాతీయ కౌన్సిల్ సభ్యులు బుక్క రాంబాబు, నాయకులు లింగాల సాయి,గట్టు అశోక్, పాలవరపు శ్రీనివాస్, తండ నాగేందర్, ఎరుకల సైదులు, నందిపాటి సైదులు, బిక్షం రూథర్, రామారావు, సందీప్, కొంగల సతీష్, బొల్లికొండ సతీష్, బుక్క ఉపేందర్, శ్రవణ్, శంకర్, నాగరాజు, శరత్, మధు, సుమన్, సైదులు, నర్సయ్య, ప్రవీణ్, మధు, రాజు, బాచి రాంబాబు, శ్రీనివాస్ రావు, బూర వెంకన్న, సైదయ్య, గౌసుద్దీన్, వెంకన్న, యాదగిరి, నజీర్, అసిఫ్ ,దుర్గం వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :