ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / మంచిర్యాల జిల్లా : బెల్లంపల్లిలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 25 మంది లబ్ధిదారులకు పది లక్షల మూడు వేల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఎవరికీ తెలిసేది కాదని, కానీ ఇప్పుడు అందరికి అందుబాటులోకి తెచ్చిన ముఖ్యమంత్రి కెసిఆర్ కే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, బీఆరెస్ టౌన్ ప్రెసిడెంట్ బొడ్డు నారాయణ, కౌన్సిలర్లు నీలి కృష్ణ, కొక్కెర చంద్రశేఖర్, గొల్లపల్లి సర్పంచ్ ఇందూరి శశికళ, నాయకులు కిరణ్, సింగతి రాంచందర్, శ్రీధర్, మల్లేష్, రమేష్, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News