Tuesday, 28 July 2026 06:14:21 AM

శంషాబాద్ విమానాశ్రయంలో రూ.7 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం...

బ్యాంకాక్ నుంచి వస్తున్న ఇద్దరి వద్ద హైడ్రోపోలిక్ వీడ్‌

Date : 01 November 2024 04:33 PM Views : 466

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో డిఆర్ఐ అధికారులు రూ.7 కోట్ల విలువ చేసే 7.096 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్‌ను ‘హైడ్రోఫోనిక్ గంజాయి’గా గుర్తించారు. ఈ డ్రగ్స్‌కు సంబంధించి బ్యాంకాక్ నుంచి వచ్చిన ఇద్దరిని అరెస్టు చేశారు.వీరిద్దరి లగేజీని తనిఖీ చేసిన సమయంలో అనుమానం వచ్చిన అధికారులు… క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.13 కెల్లాగ్స్ ప్యాకెట్లలో ఈ డ్రగ్స్‌ ను గుర్తించారు. నిందితులపై 1985 ఎన్డీపిఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :