ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు కొంత మంది మన నాయకులు సిద్ధపడ్డారని వారితో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడడం జరిగిందని రామగుండం శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్ తెలిపారు.రామగుండం నియోజకవర్గంలో BRS పార్టీ గెలుపు కోసం అందరూ కలిసి పని చేయాలని కేటీఆర్ ఆదేశించారని ఇందులో ఏటువంటి లోపాయి కార ఒప్పందాలు లేవని స్పష్టం చేశారు. కొంత మంది సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తూ మా నాయకుల గౌరవాన్ని కించపరిచే విధంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. రామగుండం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య ఉన్న ఐక్యతను విచ్చినం చేసేందుకు సోషల్ మీడియా వేదికగా దాడులు జరుగుతున్న విషయం నా దృష్టికి రావడంతో ఈ ప్రకటన విడుదల చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే వాటిని పరిగణలోకి తీసుకోకుండా పార్టీ నాయకులు, కార్యకర్తలు మన ముందున్న లక్ష్యాన్ని, బాధ్యతను గుర్తు చేసుకొని ముందుకు వెళ్లాలని అన్నారు. మనకు బద్ధ శత్రువులైన కాంగ్రెస్, బిజెపి పార్టీలు ఏలాగైనా రామగుండంలో పట్టు సాధించేందుకు అసత్యాలను ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడం జరుగుతుందని, వీటిపై గులాబీ పార్టీ శ్రేణులు దృష్టి సారించి రాబోయే ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడేలా విధంగా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేశారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ పార్టీ నాయకులపై గాని కార్యకర్తలపై గాని అసత్యపు ప్రచారాలు చేసే వారి పట్ల చట్టపరిధిలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని పార్టీ జిల్లా అధ్యక్షుడిగా హెచ్చరిస్తున్నానట్లుగా ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు.
Admin
Aakanksha News