Wednesday, 29 July 2026 07:59:47 AM

14 రోజుల పసికందును దారుణంగా హత్య చేసిన కన్నతల్లి..

Date : 28 March 2025 05:56 PM Views : 702

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : నగరంలోని మైలార్‌దేవ్‌పల్లిలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. ఆలీ నగర్‌లో 14 రోజుల పసికందును కన్నతల్లే దారుణంగా హత్య చేసింది. తమిళనాడుకు చెందిన దంపతులు హైదరాబాధ్‌కి పని కోసం వచ్చారు. అయితే భర్తకు కొద్దిరోజుల క్రితం రెండు కిడ్నీలు చెడిపోయాయి. దీంతో ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోయాయి. ఈ క్రమంలో తల్లి పసికందును నీళ్ల బకెట్‌లో ముంచి చంపి దాన్ని ప్రమాదంగా చిత్రీకరించింది. స్నానం చేసి వచ్చే సరికి పసికందు నీళ్ల బకెట్‌లో పని పోయినట్లు నాటకం ఆడింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారించగా.. తానే బిడ్డను చంపినట్లు తల్లి ఒప్పుకుంది. దీంతో పోలీసులు తల్లిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :