Tuesday, 28 July 2026 04:15:05 AM

కోర్టుల నిర్ణయాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించే హక్కు ప్రతి పౌరుడికి ఉంది..

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌

Date : 24 November 2024 06:47 PM Views : 452

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / న్యూఢిల్లీ : న్యాయమూర్తులు జాగ్రత్తగా ఉండాలని మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ అన్నారు. కేసుల తీర్పులను ప్రభావితం చేసేందుకు కొందరు సోషల్‌ మీడియాను ఉపయోగిస్తున్నారన్నారు. దానిపై అప్రమత్తంగా ఉండాలని అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రస్తుత రోజుల్లో యూట్యూబ్‌, సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ కారణంగా 20 సెకన్ల ఆధారంగా అభిప్రాయాన్ని ఏర్పరచాలని కోరుకుంటున్నారని.. ఇది ప్రమాదకరమన్నారు. కోర్టుల నిర్ణయాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించేరందుకు ప్రతి పౌరుడికి హక్కు ఉందని.. అయితే, కోర్టు నిర్ణయాలను దాటి న్యాయమూర్తులను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకున్న సమయంలో ‘ఇది నిజంగా భావ ప్రకటన స్వేచ్ఛా? అనే ప్రాథమిక ప్రశ్నను లేవనెత్తుతుందన్నారు. కోర్టుల్లో నిర్ణయం తీసుకునే ప్రక్రియ చాలా తీవ్రమైందని.. దీన్ని అర్థం చేసుకునే ఓపిక, సహనం ఎవరికీ లేదన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :