Sunday, 26 April 2026 06:05:12 PM

33 డివిజన్ లో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి...

ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్

Date : 06 January 2024 08:29 PM Views : 573

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : రామగుండం నియోజకవర్గం 33 వ డివిజన్ లోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్ కోరారు. డివిజన్లోని ప్రజలు కార్మికులు తీవ్ర సమస్యలతో బాధపడుతున్న క్రమంలో రోడ్డు పనులు చేపట్టాలని అర్జీ-1 జీయం చింతల శ్రీనివాస్ కు వినతి అందించడంతో స్పందించి నూతన రోడ్డు నిర్మాణ పనులను చేపట్టారు. ఈ సందర్భంగా జయం కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మద్దెల దినేష్ మాట్లాడుతూ.. ప్రభావిత 33డివిజన్ లో కొన్ని సమస్యలతో కార్మికులు వారి కుటుంబాలు, ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కుంటున్నారని పేర్కొన్నారు. ప్రభావిత డివిజన్ లో రెండు లేక మూడు నెలలకు ఒక్క సారి సింగరేణి ఆధ్వర్యంలో స్పెషలిస్ట్ వైద్యనిపుణులతో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని జీఎంను కోరారు.కావున ప్రభావిత ప్రాంతమైన 33వ డివిజన్ లో మరిన్ని అభివృద్ధి పనులు ప్రజల సౌకర్యార్థం కొరకు చేయాలని, మద్దెల దినేష్ పేర్కొన్నారు. ఇంక ఈ కార్యక్రమంలో డివిజన్ యువకులు మండల శ్రీనివాస్, శేంషేర్, అనిల్, కుమార్, అశోక్, రాజు తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :