ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : సింగరేణి సేవా సమితి ఆర్జీ-1 ఏరియా ఆద్వర్యంలో మాత రిసెర్చి ఇనిస్టూట్ డా:విశ్వనాధ మహర్శి, అయుర్వేద స్పెషలిస్టు ఆర్.సి.ఓ.ఏ క్లబ్ నందు ఆయుర్వేద మెడికల్ క్యాంపును 19వ తేదీన సోమవారం ఉదయం 10.00 గం.ల నుండి సా:6.00 గం.ల వరకు నిర్వహిస్తున్నాట్లు అర్జీ-1 జీఎం చింతల శ్రీనివాస్ ఒక్క ప్రకటలో వెల్లడించారు. ఈ మెడికల్ క్యాంపులో వివిధ రాకలైన ఆనారోగ్య సమస్యలు, చర్మ వ్యాధులు, మోకాళ్ళ నొప్పులు, బిపి, షుగర్, థైరాయిడ్, మల బద్ధకం, అజీర్ణం, పక్షవాతం, అస్తమా, స్త్రీలా వ్యాధులు ఇంగ్లీష్ మందులచే తక్కువ కాని మొండి వ్యాధుల కోసం ఈ వైద్య శిబిరము నిర్వహించుచున్నారు. ఈ అవకాశాన్ని పారిశ్రామిక ప్రాంత ప్రజలు సింగరేణి ఉద్యోగస్తులు, వారి కుటుంబ సభ్యులు సద్వినియోగించుకోవాలని జీఎం తెలిపారు.
Admin
Aakanksha News