Tuesday, 28 July 2026 04:15:52 AM

కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణ తల్లిని, బతుకమ్మను దూరం చేస్తున్నారు...i

మండిపడ్డ ఎమ్మెల్సీ కవిత

Date : 15 December 2024 06:07 PM Views : 838

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / జగిత్యాల జిల్లా : జగిత్యాలలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత పర్యటిస్తున్నారు. ధరూర్‌ బైపాస్‌ వద్ద ఎమ్మెల్సీ కవితకు గజమాలతో ఘన స్వాగతం పలికారు. పెద్దసంఖ్యలో మహిళలు, కార్యకర్తలు తరలివచ్చారు. బైపాస్‌ వద్ద ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి కవిత బతుకమ్మ ఆడారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. జగిత్యాల అంటేనే బీఆర్‌ఎస్‌ అడ్డా అని మీ అందర్నీ చూస్తే తెలిసిపోతుందని అన్నారు. కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణ తల్లిని, బతుకమ్మను దూరం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ లేకపోవడంపై మహిళలు మండిపడుతున్నారని తెలిపారు. ఆరు గ్యారంటీల్లో భాగంగా మహిళలకు రూ.2500 ఇస్తామన్న హామీ ఏమైందని రేవంత్‌ సర్కార్‌ను నిలదీశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :