Tuesday, 28 July 2026 01:26:17 PM

బోధన్ సిఐ ప్రేమ్ కుమార్ అరెస్ట్...

Date : 28 January 2024 04:31 PM Views : 498

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / రంగారెడ్డి జిల్లా : బోధన్ మాజీ సీఐ ప్రేమ్ కుమార్ అరెస్ట్ అయ్యారు. ఆదివారం ఉదయం పంజాగుట్ట పోలీసులు సీఐను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ ఆమీర్ హైదరాబాద్ లోని ప్రగతిభవన్ వద్ద బారికేడ్లను డీకొట్టిన సంగతి తెలిసిందే. అనంతరం పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేయగా.. ఈ కేసు నుంచి తన కుమారుడిని తప్పించేందుకు షకీల్ పోలీసులపై ఒత్తిడి చేశాడు. అనంతరం రాహిల్ దుబాయ్ పారిపోయాడు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ప్రత్యేకంగా విచారణ జరిపి పంజాగుట్ట పోలీసులపై వేటు వేశారు. విచారణలో భాగంగా బోధన్ సీఐగా పనిచేసిన ప్రేమ్ కుమార్ సహకరించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఆయన్ను అరెస్టు చేశారు. బోధన్ కు చెందిన షకీల్ అనుచరుడు అబ్దుల్ వాసేను సైతం అరెస్టు చేసినట్లు సమాచారం.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :