Tuesday, 28 July 2026 08:21:35 AM

రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో పిల్లలకు పోలియో చుక్కలు...

Date : 04 March 2024 04:57 PM Views : 405

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ జిల్లా శాఖ ప్రెసిడెంట్ మరియు హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి గారి ఆదేశాలు మేరకు రెడ్ క్రాస్, హైదరాబాద్ జిల్లా శాఖా చైర్మన్ మామిడి భీమిరెడ్డి గారి ఆధ్వర్యంలో నిన్న రాత్రి సరిగ్గా 12 గంటలకు సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లో మరియు మహాత్మా గాంధీ బస్ స్టాప్ ల లో పిల్లలకు నిండైన జీవితానికి రెండు చుక్కలు అనే నినాదంతో హైదరాబాద్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ వెంకట్ మరియు డిప్యూటీ మెడికల్ హెల్త్ ఆఫీసర్ లతో చైర్మన్ మామిడి భీమ్ రెడ్డి, రెడ్ క్రాస్ హైదరాబాద్ జిల్లా శాఖ బ్లడ్ సెంటర్ కన్వీనర్ డాక్టర్ బి విజయ్ భాస్కర్ గౌడ్ ,హైదరాబాద్ జిల్లా, రెడ్ క్రాస్ టీం కలిసి ప్రయాణికుల పిల్లలకు పోలియో చుక్కలను వేసి వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఐదు సంవత్సరాలు లో బడి న పిల్లలకు కచ్చితంగా రెండు పోలియో చుక్కలు తప్పకుండా వేయించుకోవాలని తెలియజేశారు. చిన్నారుల భవిష్యత్తుకు ఈ పోలియో చుక్క లు అవసరమని భవిష్యత్తులో వారికి పోలియో వ్యాధి సోకకుండా పూర్తిగా నివారించడానికి ఈ చుక్కలు అవసరమని చైర్మన్ గారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా శాఖ మేనేజింగ్ కమిటీ సభ్యులు పి వీరమణి, వినయ్ కిశోర్ మరియు రెడ్ క్రాస్ వాలంటీర్లు లక్ష్మీపార్వతి, శిల్పారెడ్డి, హరిప్రియ ధర్మ తేజ, రాకేష్ తదితరులు పాల్గొన్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :