Wednesday, 29 July 2026 01:07:47 PM

ఏడుపాయల వనదుర్గామాతను దర్శించుకున్న సిఎం రేవంత్‌ రెడ్డి...

Date : 25 December 2024 04:42 PM Views : 698

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / మేదక్ జిల్లా : ఏడుపాయల వనదుర్గామాతను సిఎం రేవంత్‌ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి సిఎం పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఏడుపాయల వనదుర్గ అమ్మవారి ఆలయానికి వచ్చిన సిఎంకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో సాదర స్వాగతం పలికారు. సిఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బిజెపి ఎంపి రఘునందన్ రావు, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, మైనంపల్లి హన్మంతు రావు, పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఇవాళ మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా సిఎం రేవంత్ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :