Tuesday, 28 July 2026 07:01:02 AM

జన్మదినం ఇతరులకు ఆదర్శంగా నిలవాలి..

Date : 02 November 2022 03:03 PM Views : 466

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : జన్మదిన వేడుకలు ఇతరులకు ఆదర్శంగా నిలవాలని సీనియర్ పాత్రికేయులు, ఓ దినపత్రిక గోదావరిఖని ఇంచార్జీ దాట్ల జేమ్స్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పుట్టినరోజు వేడుకలు మన సంతోషం కోసం కాకుండా ఇతరుల సంతోషం కోసం జరుపుకునే విధంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలని అన్నారు. ఈ రోజు తన జన్మదినం సందర్భంగా విఠల్ నగర్ లోని అమ్మ పరివార్ అనాధాశ్రమంలో కేక్ కట్ చేసి అన్నదానం చేశారు. తన పుట్టినరోజు వేడుకలను ఈ విధంగా అందరితో కలిసి అనాధాశ్రమంలో జరుపు కోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. అనంతరం జేమ్స్ రెడ్డిని పలువురు అభినందించారు. ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. దీంతో పాటు జ్యోతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద విద్యార్థుల చిరునవ్వుకు ప్యాకెట్ నిమిత్తం 2 వేల రూపాయలను జేమ్స్ రెడ్డి జన్మదినం సందర్భంగా పాత్రికేయులు పూసాల శ్రీధర్ ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో తోటి పాత్రికేయులు పూసాల శ్రీధర్, రంగు రాము, పెనగొండ సతీష్, గడ్డం శ్యాంకుమార్, వి.ఎన్ చారి, మిట్టపల్లి మొగిలి, సూర్యనారాయణ రెడ్డి, బొజ్జ సురేందర్, తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :