Sunday, 26 April 2026 05:56:00 PM

భవిష్యత్తులో విద్యార్థులందరూ ఉన్నత శిఖరాలను అధిరహించాలి

Date : 25 November 2022 03:55 PM Views : 424

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : విద్యార్థులలో దాగివున్న ప్రతిభా పాటవాలను, సృజనాత్మకతను వెలికితీసి, భవిష్యత్తులో విద్యార్థులందరూ ఉన్నత శిఖరాలను అధిరహించాలనే సంకల్పంతో రామగుండం శాసన సభ్యులు కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో రామగుండం ప్రాంతంలోని విద్యార్థి విద్యార్థినులకు బలోత్సవ్-22 పేరుతో పలు రంగాలలో వారం రోజుల పాటు విద్యార్థులకు కాంపిటీషన్ నిర్వహించారు.బలోత్సవ్-2022 లో భాగంగా గోదావరిఖని స్థానిక గీతాంజలి హై స్కూల్ లో విద్యార్థులకు "చిత్రలేఖనం" పోటీలు నిర్వహించారు. ఈచిత్ర లేఖనం పోటీలకు ముఖ్య అతిథిగా స్థానిక 28వ డివిజన్ కార్పొరేటర్ ఇంజపురి పులెందర్ హాజరై పోటీలను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో ముందు ఉండాలని శాసన సభ్యులు కోరుకంటి చందర్ ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాలోత్సవ్ కో- ఆర్డినేటర్ PS అమరేందర్,నిర్వాహకులు A సమ్మారావు, K శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ చిత్రలేఖనం పోటీల్లో వివిధ పాఠశాలలకు చెందిన 170 మంది పాల్గొని తమ సృజనాత్మకతను చాటుకున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :