ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / నాగర్‌కర్నూల్ జిల్లా : లాగచర్ల రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బాధ్యులు మాట్లాడుతూ...లగుచర్ల రైతుల భూములు వారి ఫార్మా కంపెనీకి ఇవ్వకపోవడంతో కక్ష కట్టిన రాష్ట్ర ప్రభుత్వం రైతులను అక్రమంగా అరెస్టు చేసి వారిపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైళ్లలో నిర్బంధించారని పేర్కొన్నారు. రైతన్నల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నియంతృత్వ నిరంకుశ,అమానవీయ, అణిచివేత విధానాలకు నిరసనగా, రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేసి విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నరసింహ గౌడ్, స్థానిక, బీఆర్ఎస్ కౌన్సిలర్లు మనోహర్ ప్రసాద్, రమేష్ రావు, పార్టీ నాయకులుఅమీనోద్దీన్, బండపల్లి. వెంకటయ్య, శంకర్, మాధవాచారి, గాలిగూటి జగదీష్, అజ్జు, రవినాయక్, దేవా, రాజు, తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News