Tuesday, 28 July 2026 11:52:58 AM

లిక్కర్ స్కాంలో కవిత, భర్త అనిల్ అభియోగాలు

Date : 01 May 2023 10:08 PM Views : 540

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మళ్లీ ఈడీ అధికారులు లిక్కర్ స్కాంపై దూకుడు పెంచినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈడి మోపిన ఉపయోగాలు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలకు దారితీస్తుంది. ఈడీ అధికారులు తాజాగా మూడో ఛార్జ్ షీట్ ను దాఖలు చేశారు. ఈ ఛార్జ్ షీట్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఆమె భర్త అనిల్ పేర్లను చేర్చారు. ఈ మేరకు కవితపై కీలక అభియోగాలు మోపారు. ప్రముఖంగా సౌత్ గ్రూప్ కు సంబంధించిన కీలక విషయాలను ఈడీ ఈ ఛార్జ్ షీట్ లో పొందుపరిచింది. ఎమ్మెల్సీ కవిత, ఆమె భర్తతో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ రెడ్డిపై ఈడీ అభియోగాలు మోపింది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :