ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : గత నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమరపు సత్యనారాయణ చెక్ పెట్టారు. గోదావరిఖని శివాజీ నగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ...100 శాతం రామగుండం నియోజక వర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగానే పోటీ చేస్తానని తెలిపారు. ఎన్నికల్లో ఏ గుర్తు వస్తుందో అదే గుర్తుపై పోటీలో ఉంటానని స్పష్టం చేశారు. రామగుండం నియోజక వర్గంలో చాలా మంది నా సహకారం కోరుకుంటున్నారని అన్నారు. ఎవరు ఎంత డబ్బు ఖర్చు చేసిన ప్రజలు చేసిన పనులను మర్చిపోరాని తెలిపారు. రామగుండంలో నేను గెలిచే అవకాశం ఉందన్నారు. విద్యావంతుడిగా, అనుభవం ఉన్న నాయకుడిగా సమర్ధవంతమైన నిజాయితీ పాలనను అందిస్తానని పేర్కొన్నారు. ఏ పార్టీ గెలిచిన ఎలా పని చేయించుకోవాలో నాకు తెలుసని అన్నారు. నియోజక వర్గంలో సోమరపు సత్యనారాయణ కంటూ ఒక ప్రత్యేకత ఉందని, నా నిజాయితీనే నన్ను గెలిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Admin
Aakanksha News