Friday, 12 June 2026 12:47:50 AM

కల్లు మండువలో గుర్తింపు కార్మిక సంఘం నేతలు

కార్మికులకు ఒక న్యాయం.. ఖద్దరు చోక్క నాయకులకు మరో న్యాయమా...?

Date : 04 March 2023 07:01 PM Views : 898

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : సింగరేణిలో కొంతమంది నాయకులు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారుతుంది. తప్పు చేస్తే ఎవరైనా ఒక్కటే అని గొప్పలు చెప్పే అధికారులకు కొంత మంది ఖద్దరు చొక్క నాయకుల చేసేఫ్ తప్పులు కనిపించడం లేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. వివరాల్లోకి వెళ్లితే... రామగుండం ఏరియా-1లోని జిడికే 2వ ఇంక్లైయిన్,2ఏ లో గుర్తింపు సంఘంలో కొనసాగుతున్న ఇద్దరు ఫిట్ సెక్రటరీలు శనివారం మాస్టర్ పడి కల్లు మండువకు వెళ్లి కల్లు సేవించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చిన్న చిన్న తప్పులు చేశారని కార్మికులకు మెమోలు జారీ చేసే అధికారులకు ఈ ఖద్దరు చోక్క లీలలు కనిపించడం లేదా అని పలువురు కార్మికులు ప్రశ్నిస్తున్నారు. విధులకు హాజరై దర్జాగా బయటకు వెళ్లిన దీనిపై అధికారులు నోరు మెదపక పోవడం పట్ల ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి.. ఇందులో కొంత మంది అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు విమర్శలు వెలువెత్తుతున్నాయి. విధులకు హాజరైన సమయంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించి విధులు నిర్వహిస్తున్నారా లేదా అని చూడాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇలాంటి చోట మోట నాయకులు ఆగడాలు పెరిగిపోతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సింగరేణి ఉన్నతాధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :