ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న అభివృద్ధి పనులలో నాణ్యత లోపించిందని రామగుండం కార్పొరేషన్ 25వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పోరేటర్ నగునూరి సుమలత - రాజు ప్రకటన ద్వారా వెల్లడించారు... గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటీవల కాలంలో కాంపౌండ్ వాల్ తో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాలు తదితర అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. వీటి విషయంలో ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులు పర్యవేక్షించాల్సి ఉందని అయితే. స్థానికంగా అధికారులు లేకపోవడంతో అవినీతి రాజ్యమేలుతుందన్నారని విమర్శించారు. మెడికల్ కాలేజ్ లో ప్రిన్సిపల్ గా వ్యవహరించాల్సి ఉండగా ఆమె ఆస్పత్రి, సిబ్బంది విషయాలలో ఇష్టానుసారంగా వ్యవహరించడం ఎంటనీ ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో తలదూర్చిన సంఘటనలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కూడా మందలించిన్నట్లు తెలిసిందని కార్పొరేటర్ పేర్కొన్నారు.సదరు ప్రిన్సిపల్ కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కాంట్రాక్టు కమీషన్లకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యత లేని పనులు చేస్తూ అడ్డగోలుగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆసుపత్రి అభివృద్ధి విషయంలో ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులు పర్యవేక్షించాల్సి ఉండగా దృష్టి సారించడం లేదని పేర్కొన్నారు. ఈ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే ఊరుకునేది లేదని పేర్కొన్నారు. అదేవిధంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ విధులు సరిగా నిర్వహించడం లేదని పేర్కొన్నారు. ఈ స్థానంలో మరొకరిని నియమించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు, సంబంధిత మంత్రి దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు కార్పొరేటర్ నగునూరి సుమలత -రాజు పేర్కొన్నారు.
Admin
Aakanksha News